
జనం న్యూస్ 12 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా సెక్షన్ 30 పోలీసు చట్టంను నవంబర్ 12 నుంచి డిసెంబర్ 11వరకు అమలు చేస్తున్నట్లు విజయనగరం ఇన్ఛార్జ్ డీఎస్పీ ఆర్.గోవిందరావు మంగళవారం తెలిపారు. ముందస్తు అనుమతులు లేకుండా ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.ప్రజలు శాంతియుతంగా వ్యవహరించి, పోలీసుశాఖ అనుమతులతోనే కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.