జనం న్యూస్. జనవరి 31. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్)
ఆటో బైక్ ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది, హత్నూర ఎస్సై కె.సుభాష్ తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. హత్నూర మండలంలోని సాదుల్ నగర్ గ్రామానికి చెందిన కందుకంల ప్రభాకర్ తన బైక్ పై సంగారెడ్డి వైపు నుండి వస్తున్న క్రమంలో గుండ్ల మాచునూర్ గ్రామ సమీపంలోని కోలెంట్ పరిశ్రమ వద్ద ఆటో బైక్ ను ఢీకొట్టడంతో . కందుకంల ప్రభాకర్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కే. సుభాష్ తెలిపారు.