
జనంన్యూస్. 12. నిజామాబాదు.
దేశాయ్ సమస్యలపై ఆందోళనలు ఉదృతం చేయనున్నట్లు తెలంగాణ ప్రగతిశీల భీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధానకార్యదర్శి ఆర్. రమేష్ స్పష్టం చేశారు. బుధవారం నాడు తెలంగాణ ప్రగతిశీల భీడీ వర్కర్స్ యూనియన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దేశాయ్ సమస్యలపై ఆందోళనల పోస్టర్స్ ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు దేశాయ్ యాజమాన్యం కార్మికుల పొట్ట కొట్టి, కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తూ వేతన ఒప్పందాలకు ఎగ నామం పెట్టి కార్మికులకు ఇవ్వాల్సిన కూలీల్లో నుండి పది రూపాయలు తక్కువ చేసి ఇవ్వడం ఇటు కార్మికులను అటు ప్రభుత్వాన్ని మోసం చేయడమేనన్నారు. రోజుకు వేయి బీడీలకు పది రూపాయల చొప్పున 70వేలమంది వద్ద కోట్లాది డబ్బుల్ని దోచుకున్నారన్నారు. కార్మికుల్ని మోసం చేస్తూ డబ్బులు దండుకొని మోసం చేస్తున్నారన్నారు. మరొక వైపు వేయి భీడీలకు సరిపోయే అంత ముడిసరుకులు (ఆకు, తంబాకు, దారం) ఇవ్వడం లేదు అని అదికూడా నాసిరకం ది ఇవ్వడం వల్ల మరింత నష్టపోవాల్సిన దుస్థితి ఏర్పడింది అన్నారు. తమ దోపిడీ చాలదు అన్నట్టుగా పితారా పేరుతో ఉన్న నాసిరకం జీరో తినుబండారలను, ప్రభుత్వ అనుమతి లేనివి కార్మికులకు అంటగడుతున్నారాన్నారు (విక్రయస్తూన్నరన్నారు). దీని వల్ల కార్మికులు ఇష్టం లేకున్న కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది అన్నారు. దేశయ్ బ్రదర్స్ కంపెనీ చేస్తున్న ఆర్థిక దోపిడీ విషయంలో చట్టరీత్య చర్యలు తీసుకొని 10సంవత్సరాలనుండి దోచుకున్న కోట్లాది డబ్బులను కార్మికులకు తిరిగి చెల్లించేలాగా చర్యలు తీసుకోవాలి అని వారు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రగతిశీల భీడీవర్క్స్ యూనియన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా సహాయకార్యదర్శి ఎం. అనిస్, నాయకులు ఎం. లింబాద్రి, ఎస్. కిశోర్, టీ. రామాగంగు, ఎస్. గంగామణి, ఎం లక్ష్మి, టీ. గంగామణి తదితరులు పాల్గొన్నారు.
