
జనం న్యూస్ 12 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
జోగులాంబ గద్వాల్ జిల్లా తెలంగాణ రైతాంగ సమితి..ఈ యాసంగితో ముందుగానే జూరాల ప్రాజెక్టు నీరును విడుదల చేయాలని సూపర్డెంట్ ఆఫీస్ జోగులాంబ గద్వాలలో డిప్యూటీ ఇంజనీర్ మేడమ్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈనెల చివరిదాకా వరి కోతలు అయిపోతాయి వరి ధాన్యం రైతు ల చేతికి వస్తుంది. వరి పంట కోసిన వెంబడే వరి నార్లు పోసుకుంటే డిసెంబర్ చివరిదాకా నాట్లు అయిపోయి మార్చి చివరి వరకు యాసంగి పంటలు చేతికి వస్తాయి లేదంటే ప్రతి సంవత్సరం జూరాల ఆయకట్టు యాసంగిలో సాగునీరు కొరత ఏర్పడి పంటలు తీవ్రంగా నష్టపోతున్నాయి కనుక ఈసారి ముందుగా యాసంగి సాగునీరు అని పంటలకు విడుదల చేస్తే వేసవి ఎండలు తీవ్రం కాకముందే యాసంగి పంటలు చేతికి వస్తాయి కనక వెంటనే ప్రభుత్వం సాగునీరు అధికారుల సమావేశాన్ని ఏర్పాటు చేసి జూరాలయకట్టుకు నీరు విడుదల చేసే విధంగా నిర్ణయించాలని తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర అధ్యక్షులు జక్కుల వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి జి గోపాల్, జోగులాంబ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్య రెడ్డి లు కలిసి జిల్లా అధికారులకు వినతిపత్రం అందజేశారు.