
బిఆర్ఎస్ మండల అధ్యక్షులు కలగూర రాజకుమార్
జనం న్యూస్ /నవంబర్ 12/ప్రతినిధి కాసి పేట రవి
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి –2025 రాజ్యాంగ విరుద్ధమైందని, ఇది కార్మికులను బానిసలుగా మార్చే కుట్ర అని భీమారం మండల బిఆర్ఎస్ మండల అధ్యక్షులు కలగూర రాజ్ కుమార్ , మండిపడ్డారు. .. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం కార్మికుల హక్కులను బలహీనపరిచే దిశగా అడుగులు వేస్తోంది. అక్టోబర్ 8న విడుదల చేసిన శ్రమశక్తి నీతి–2025 అనే నూతన లేబర్ పాలసీ రాజ్యాంగంలోని సామాజిక న్యాయం, సమానత్వం, శ్రమకు గౌరవం వంటి విలువలకు విరుద్ధంగా ఉంది అని పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపే కోట్లాది కార్మికులపై ప్రభావం చూపే ఈ విధానాన్ని యూనియన్లతో చర్చించకుండా, ఏకపక్షంగా అమలు చేయడం అప్రజాస్వామిక చర్య. కొత్త పాలసీ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, గిగ్, ప్లాట్ఫాం కార్మికులపై యజమానుల నియంత్రణను మరింత పెంచి, వేతన హామీలు, పని గంటల పరిమితి, భద్రత వంటి అంశాలను నిర్వీర్యం చేస్తుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటు చేతుల్లోకి అప్పగించడమే ఈ విధానం లక్ష్యం. దేశ నిర్మాణంలో కీలకమైన కార్మిక వర్గాన్ని కార్పొరేట్ల లాభం కోసం, త్యాగం చేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ఈ లేబర్ పాలసీని రద్దు చేయలని స్పష్టం చేశారు. కార్మికులందరూ ఐక్యంగా పోరాడాలి. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు ఎదురొడ్డి అన్ని యూనియన్లు, కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. శ్రమశక్తి నీతి 2025 పేరుతో కార్మిక హక్కులను హరించే ప్రయత్నాలను అడ్డుకోవాలని . కార్మిక హక్కుల రక్షణ కోసం ప్రతి ఉద్యోగి ఖండించి ముందుకు రావాలని కోరారు.