
జనం న్యూస్ 12 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
జోగులాంబ గద్వాల్ జిల్లా డిఇఓ కి వినతి బి ఆర్ యస్ వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య ఈ రోజు గద్వాల జిల్లా కేంద్రం లోని డీఈఓ ని కలిసి చర్యలు తీసుకోవాలి అని వినతిపత్రం ను ఇవ్వడం జరిగింది.ధరూర్ మండలంలోని అముక్త ఆస్పిరెంట్ స్కూల్ కి అనుమతి లేకుండా నడుపుతున్నారు వాటిపైన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా గద్వాల మండలం లోని వీరపురం దగ్గర ఢిల్లీ వరల్డ్ స్కూలు లో అధిక ఫీజులు వసూలు చేస్తూ నర్సరీ క్లాస్ కి 40 వేలు మరియు ఏడో తరగతికి 70 వేల రూపాయలు భారీగా దోపిడీ చేస్తూ వసూలు చేస్తున్నారు. దీనిపైన కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలి.
ఈ సందర్భంగా బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య మాట్లాడుతూ…జిల్లాలో అనుమతులు లేకుండా కొత్త స్కూలు పుట్టగొడుగుల పుట్టుకొస్తూ కేవలం విద్యను వ్యాపారం చేయడానికి మాత్రమే వాటిని నిర్వహిస్తున్నారు అటువంటి వాటిపైన తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్.అదేవిధంగా జిల్లాలోని చాలా స్కూల్ కార్పొరేట్ స్థాయిలో పేర్లు పెట్టుకొని కేవలం విద్యను వ్యాపారంగా మార్చుకోవడానికి ఢిల్లీ స్కూల్ లు దేశ స్కూలు, ఇంటర్నేషనల్ స్కూల్స్, నేషనల్ స్కూల్స్, ఆక్స్ఫర్డ్ స్కూల్ అని పేర్లు పెట్టుకుంటూ లక్షల లక్షలు వసూలు చేస్తున్నారు ఆస్కుల పైన కూడా ఆ కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.జోగులాంబ గద్వాల జిల్లాలో విచ్చలవిడిగా విద్యను వ్యాపారంగా మార్చుకుంటున్నారు. ఆ స్కూల్ లలో విద్యా ప్రమాణాలు లేకున్నా కూడా వాటికి రంగులు వేసి వ్యాపారంగా చేసుకుంటున్నారు. విద్యార్హత లేని టీచర్లు, మౌలిక సదుపాయాలు లేవు, బాత్రూమ్స్, టాయిలెట్స్ లేవు, ఇరుకైన తరగతి గదుల గల పాఠశాలలు, అట స్థలాలు లేని స్కూలు ఫీజులు మాత్రం లక్షల్లో వసూలు చేస్తూ నడిగడ్డ ప్రజల రక్తాన్ని పీల్చక తింటున్నారు. వీటిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నరసింహులు మహేష్ తదితరులు పాల్గొన్నారు.