
జనం న్యూస్ నవంబర్ 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన,
కాట్రేనికోన మండల ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమo కాట్రేనికోనలోని గ్రంధి నాగేశ్వరరావు కళ్యాణ మండపంలో మంగళవారం నిర్వహించారు.మండలం లోని ఆర్య వైశ్యలు అంతా కుటుంబ సమేతంగా హాజరై సహా పంక్తి భోజనాలు చేశారు.ఈ సందర్బంగా పలు సాంస్కృతిక పోటీలు నిర్వహించి ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా వారి ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త గ్రంధి నాగేశ్వరరావు దంపతులను ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ గ్రంది గుప్తా గ్రంధి నాగేశ్వరరావు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో చిట్టూరి బ్రదర్స్ మోటమర్రి బ్రదర్స్,గ్రంధి బ్రదర్స్,చెరుకు బ్రదర్స్, కంచర్ల బ్రదర్స్, కొత్త గుండు బ్రదర్స్, సుతాపల్లి బ్రదర్స్ ,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
