
జనం న్యూస్ నవంబర్ 14 మునగాల
సూర్యాపేట జిల్లా మునగాల మండలం కేంద్రంలో ని దళిత పేద కుటుంబానికి చెందిన లంజపల్లి నాగరాజు కల్పనల కుమార్తె సౌజన్య ఈ సంవత్సరం నీట్ పరీక్షలో ఎంబిబిఎస్ ప్రవేట్ కాలేజీలో సిద్దిపేటలోని సురభి మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. ఫీజు కట్టటానికి ఆర్థికంగా కష్టమవుతుందని పేపర్లలో వార్తలు చూసి స్పందించిన నడిగూడెం మండలం రత్నవరం గ్రామానికి చెందిన మోలుగురు కోటయ్య సార్ కుమారుడు రవి కిరణ్ మొలుగూరి వారు అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ వారు మరియు వారి 15 మంది స్నేహితులతో కలిసి లక్ష రూపాయల ఆర్థిక సాయం నందిగామ రామారావు కరుణల ద్వారా చెక్కుని అందజేశారు.చెక్కును తీసుకున్న సౌజన్య మాట్లాడుతూ… నాకు ఆర్థికంగా సాయం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఇరుగు ఉదయ్ లంజపల్లె ముత్తయ్య ఎమ్మార్పీఎస్ నాయకులు లంజపల్లి శ్రీను నాగేశ్వరరావు శివయ్య సుమంత్, గుణశేఖర్ రాజు పాల్గొన్నారు