
జనం న్యూస్ 13 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
జోగులాంబ గద్వాల్ జిల్లా కేటి దొడ్డి మండలం పాతపాలెం గ్రామంలోని ఎస్సిల స్మశాన వాటికకు చెందిన 10 గుంటల భూమికీ హద్దులు ఫిక్స్ చేసి భూమిని ఆన్లైన్ చేయాలనీ కేటీ దొడ్డి తహసీల్దార్ రవి కి వినతి పత్రం అందజేత భీమ్ ఆర్మీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్చార్జ్ మాచర్ల ప్రకాష్ జోగులాంబ గద్వాల జిల్లా కేటుదొడ్డి మండలం పాతపాలెం గ్రామంలో సర్వే నెంబర్ 45లో ఎస్సీలకు కేటాయించిన 10 గుంటల మ్స భూమిని హద్దులు ఫిక్స్ చేసి ఆన్లైన్ చేయాలని భూమి ఇతరులు ఎక్కించుకున్నారని పాతపాలెం ఎస్సి సామజిక వర్గానికి చెందిన గ్రామస్తులతో భీమ్ ఆర్మీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్చార్జి మాచర్ల ప్రకాష్ కేటు దొడ్డి మండల తాసిల్దార్ రవి కి ఈ రోజు వారి కార్యాలయంలో కలసి వినతి పత్రం అందజేయడం జరిగింది,, అదేవిధంగా దళితుల భూ సమస్యలు పరిష్కరించాలని భూ సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించదని తాసిల్దార్ రవి తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాతపాలెం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రంగస్వామి, వెంకటేష్, వీరేష్ తదితరులు పాల్గొన్నారు