
జనం న్యూస్ 13 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం విజయనగరంలో ప్రజా ఉద్యమ ర్యాలీ నిర్వహించారు.మాజీ డిప్యూటీ స్పీకర్ వీరభద్ర స్వామి నేతృత్వంలో తహసిల్దార్ కార్యాలయం వరుకు ర్యాలీ చేసి ప్రైవేటీకరణను రద్దు చేయాలని నినాదాలు చేశారు.
అనంతరం తహశీల్దార్కి వినతిపత్రం అందజేశారు.మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రావణి పాల్గొన్నారు.