
జనం న్యూస్,నవంబర్ 13,అచ్యుతాపురం:
వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతం రెడ్డి కారును కాల్చేసి దాడికి ప్రయత్నించ్చిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని,గౌతమ్ రెడ్డికి రక్షణ కల్పించాలని వైసీపీ ట్రేడ్ యూనియన్ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు చోడిపల్లి అప్పారావు కోరారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో వైసీపీ నాయకుల పై దాడులు పెరిగాయని, ప్రజా శ్రేయస్సుకై నిస్వార్థంగా పని చేస్తున్న నాయకుల పై ఇలాంటి దాడులు జరగడం ప్రజాస్వామ్యానికి మచ్చ,ధైర్యవంతుడైన గౌతమ్ రెడ్డి పై దాడి చేయడం వెనుక రాజకీయ కుట్ర కనిపిస్తోందని,రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను,కార్మికులకు జరుగుతున్న అన్యాయాలపై గౌతం రెడ్డి నిరంతరం పోరాడుతున్నారని,ప్రజల కోసం పోరాడే నాయకుడిని లక్ష్యంగా చేసికొని గతంలో కూడా అనేక సార్లు గౌతం రెడ్డిపై దాడికి యత్నించారని,కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా లా అండ్ ఆర్డర్ చాలా దారుణంగా విఫలమైనదని ,గౌతం రెడ్డికి కూటమి ప్రభుత్వంలో రక్షణ కరువైందని,తక్షణమే ఆయనకు భద్రతను కల్పించాలని,గౌతం రెడ్డికి ఏదైనా జరిగితే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని,ఈ ఘటనపై దర్యాప్తు వేగవంతం చేసి నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు.