
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 13- 11- 2025
కురుమూర్తి స్వామి ఆశీస్సులు ప్రజా ప్రభుత్వంపై ఉండాలని శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. బ్రహ్మోత్సవం సందర్భంగా స్పీకర్ తో పాటు మంత్రి వాకిటి శ్రీహరి, దేవరకద్ర శాసనసభ్యులు జి.మధుసూదన్ రెడ్డి, శేరిలింగంపల్లి నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం స్పీకర్ విలేకరులతో మాట్లాడారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో ఆ భగవంతుడు ముఖ్యమంత్రి, ప్రజా ప్రభుత్వం కి శక్తి ప్రసాదించాలని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరియు రెండోవ సారి అధికారంలోకి రావాలని కోరినట్లు తెలిపారు. దేవరకద్ర నియోజకవర్గంకి విచ్చేసిన స్పీకర్ ప్రసాద్ కుమార్, అనిల్ కుమార్ యాదవ్ లను టీపీసీసీ కార్యదర్శి సామల్ కార్తీక్ నివాసంలో స్థానిక ఎంఎల్ఏ జీఎంఆర్ సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు మేఘ రెడ్డి, ఎన్నం శ్రీనివాస్ రెడ్డి ఆలయ కమిటీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
