
జనం న్యూస్, నవంబర్ 13, జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నంమండలం:
మండలం లో ఈ రోజు లో మెట్ పల్లి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు వెల్మల శ్రీనివాసరావు అధ్యక్షతన ఇబ్రహీంపట్నం గ్రామంలో బసవతారక ఇండో అమెరికా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీఛార్జ్ ఇన్స్టిట్యూట్ సౌజన్యంతో గ్రామ ఇబ్రహీంపట్నం ప్రజల కోసం పరిసర గ్రామాలకు కోసం ఉచిత క్యాన్సర్ శిబిరమును లయన్స్ క్లబ్ అధ్యక్షులు వెల్ముల శ్రీనివాస్, లైన్స్ క్లబ్ సభ్యులు బసవతారక వైద్యులు ప్రారంభించారు. ముందుగా విద్యార్థినిలు లైన్స్ క్లబ్ సభ్యులు క్యాన్సర్ పై అవగాహన కోసం ర్యాలీ తీశారు బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్స్ రవి శంకర్.Dr రేణుక .Dr ప్రవళిక .Dr హరీష్ రేడియోలోజిస్ట్.Mr లక్ష్మణ్ PRO మేనేజర్.Mrs బిందు పబ్లిక్ హెల్త్ మేనేజర్, Dr ప్రేరణ ఉచిత క్యాన్సర్ శిబిరంకి వచ్చి చికిత్స చేశారు అనంతరం క్లబ్ అధ్యక్షులు వెల్ముల శ్రీనివాసరావు మాట్లాడుతూ మెట్ పల్లి మరియు మల్లాపూర్ ఇబ్రహీంపట్నం లలో దాదాపు 13 వందలకు పైగా మందికి టెస్ట్ చేయడం జరిగిందని అలాగే ఈరోజు మల్లాపూర్లో కూడా చేయడం జరిగింది అన్నారు. ఈ శిబిరములో చేసిన చికిత్స బయట చేసుకోవాలంటే ఒకరికి 10000 పైగా డబ్బు ఖర్చు అవుతుందని దీనిని ప్రజల సద్వినియోగ నిమిత్తం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని అలాగే రోజువారిగా డయాబెటిక్ టెస్ట్ కార్యక్రమం జరుగుతుందని లయన్స్ క్లబ్ పేదల సేవా కార్యక్రమాల కోసం ఉన్నదని దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని లయన్స్ క్లబ్ సేవలో ముందుంటుందని ఉచిత కంటి వైద్య శిబిరం గుండె ఉచిత వైద్య శిబిరం అలాగే క్యాన్సర్ ఉచిత శిబిరాలు మరియు వచ్చిన డాక్టర్లకు మర్యాదపూర్వకంగా సాల్వతో సన్మానం చేసి వీడ్కోలు చెప్పడం జరిగిందని అన్నారు . ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు వెల్ముల శ్రీనివాసరావు కోశాధికారి వేములవాడ చంద్రశేఖర్ జెడ్ సి పోలీస్ శ్రీనివాస్ ఇల్లెందుల శ్రీనివాస్ లైన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు