
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
జాగ్రత్తలు పాటిస్తే వ్యాధులు దూరం తప్పనిసరిగా మాస్క్ ధరించాలి
వ్యాధిగ్రస్తులు వైద్యులు సిబ్బంది సూచనలు సలహాలు పాటించ డంతోపాటు ఆరు నెలల పాటు మందులు వాడితే పూర్తిస్థాయిలో క్షయ వ్యాధి దూరమవుతుందని నందలూరు మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ ప్రభుత్వ వైద్యులు శరత్ కార్తీక్ లు అన్నారు.ప్రధానమంత్రి టీబి ముక్తాభారత్ అభియాన్ కార్య క్రమంలో భాగంగా నందలూరు మండలంలోని 13 మంది టీబీ పేషెంట్లను నాగిరెడ్డిపల్లి సర్పంచ్ జంబు సూర్యనారాయణ దత్తత తీసుకున్నారు. గురువారం నందలూరు ప్రభుత్వ వైద్యశాల లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ వ్యాధి సోకిన వారు ప్రభుత్వం ఆరు నెలల పాటు ఉచితంగా అందించే మందులను వాడడంతో పాటు బహిరంగ ప్రదేశాలలో ప్రజలలో తిరగకుండా మాస్కులు కచ్చితంగా వాడా లన్నారు.తద్వారా వ్యాధి నుండి బయటపడవచ్చు ఆన్నారు.మంచి పౌష్టిక ఆహారం తీసుకోవడం ద్వారా శరీరంలో అధిక శక్తి లభిస్తుందన్నారు. క్షయ వ్యాధి పట్ల నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు.ఇంట్లో కూడా మాస్కు ధరించి ఉండాల న్నారు.అనంతరం రెండు నెలలకు సరిపడా పౌష్టిక ఆహార పదార్థాలను సర్పంచ్ జంబు సూర్యనారాయణ చేతుల మీదుగా అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణ అధికారి సుబ్రహ్మణ్యం ప్రోగ్రాం కోఆర్డినేటర్ ప్రణీత్ శివరాం సిహెచ్ఓ వెంకటనారాయణ ఆరీఫ్.మాజీ మార్కెటింగ్ డైరెక్టర్లు బెస్త సుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీ నాయకులు తుమ్మాది శివకుమార్,పఠాన్ మహర్ ఖాన్,తాజ్ మార్ట్ అధినేత సయ్యద్ అఫ్జల్,శివ నరసింహులు,ఆశ వర్కర్లు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
