
జనం న్యూస్ నవంబర్(13) సూర్యాపేట జిల్లా
తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో గురువారం నాడు బిఆర్ఎస్ పార్టీ కార్యంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అధ్యక్షతన ఘనంగా కాలోజి వర్ధంతిని బిఆర్ఎస్ శ్రేణులు నిర్వహించినారు. ఈ సందర్భంగా సీతయ్య మాట్లాడుతూ చావు నీది, పుట్టుక నీది,బ్రతుకంతా సమాజానిది అని వెలుగెత్తి చాటిన మహనీయుడు కాళోజి అన్నారు. కాళోజి త్యాగాలను భవిష్యత్తు తరాలకు తెలియా చేయాలి అన్నాడు. ఈ కార్యక్రమంలో గుండాగాని రాములు గౌడ్,గోపగాని శ్రీనివాస్,రమేష్,వెంకన్న, రవికుమార్,వెంకటేష్, మహేందర్,నరేష్,కోదాడ మాజీ కౌన్సిలర్ లలిత తదితరులు పాల్గొన్నారు.