
జనం న్యూస్ అక్టోబర్ 11 (భద్రాద్రి కొత్తగూడెం,) మణుగూరు:
రాష్ట్ర జేఏసీ నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన బీసీ జేఏసీ ధర్మదీక్ష పోరాటం ఈరోజుతో విజయవంతంగా ముగిసింది.ఈ సందర్భంగా బీసీ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు రెండు జిల్లాల ఇన్చార్జి బుర్ర సోమేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ, “మణుగూరు పట్టణంలో మా బీసీ జేఏసీ దీక్షను ప్రజలు, నాయకులు, వివిధ సంఘాలు అద్భుతంగా ఆదరించారు. ఈ విజయానికి కారణమైన అందరికీ మనఃపూర్వక ధన్యవాదాలు,” అని తెలిపారు.తన మాటల్లో ఆయన, “మాకు మొదటి నుండి వెన్నుదన్నుగా నిలిచిన ఎమ్మార్పీఎస్, మాల మహానాడు, కాపు సంఘం, సిపిఐ, కాంగ్రెస్, న్యూ డెమోక్రసీ పార్టీలు మరియు వివిధ కుల సంఘాల నాయకులు, మీడియా మిత్రులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు,” అని పేర్కొన్నారు.తదుపరి కాలంలో కూడా బీసీ జేఏసీ పోరాటాలకు అందరి అండదండలు కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.“జై బీసీ – జై జై బీసీ, బీసీ జేఏసీల ఐక్యత వర్ధిల్లాలి, జాజుల శ్రీనివాస్ గౌడ్ నాయకత్వం వర్ధిల్లాలి,” అంటూ బుర్ర సోమేశ్వర్ గౌడ్ గారు ముగించారు.