
జనం న్యూస్ నవంబర్ 14 నడిగూడెం
తాము చదువుకున్న పాఠశాలకు పూర్వ విద్యార్థులు కంప్యూటర్ బహుకరించారు.నడిగూడెం మండల కేంద్రంలోని శ్రీ కొల్లు పాపయ్య చౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2004 - 2005 సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు 35 వేల రూపాయల విలువగల కంప్యూటర్ ను పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవికి శుక్రవారం అందజేశారు.ఈ సందర్భంగా పాఠశాలకు కంప్యూటర్ ను బహుకరించిన పూర్వ విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు. భవిష్యత్తులో కూడా పాఠశాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు
మీరాజుద్దీన్,విఎల్ఎన్ చారి,వేపూరి పర్వతాలు,పూర్య విద్యార్థులు మేకల గంగరాజు,షేక్ యాకూబ్, సందీప్,రఫీ,మునీరు, వీరబాబు,ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.