
జనం న్యూస్ అక్టోబర్ 14( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమేల్ల శంకర్ )
మైనార్టీ గురుకుల సొసైటీ అందిస్తున్న జాతీయ విద్య దినోత్సవం 2025 వేడుకల సందర్భంగా స్థానిక భద్రాచలం మైనారిటీ గురుకులంలో కామర్స్ లెక్చరర్ గా విధులు నిర్వర్తిస్తున్న ప్రముఖ విద్యావేత్త , అంబేడ్కర్ జాతీయ ఫెలోషిప్ అవార్డ్ గ్రహీత సిద్దెల రవి కి 2025 ఉత్తమ లెక్చరర్ (బెస్ట్ లెక్చరర్) అవార్డు రావడం జరిగింది.విధుల పట్ల అంకితభవం, చక్కని క్రమశిక్షణ, సమయపాలన పాటిస్తూ, విద్యార్థులతో మమేకమై సరళమైన మార్గంలో పాఠాలు బోధిస్తూ, విధులలో చేరిన నాటి నుండి వంద శాతం ఉత్తీర్ణత అందించడంతో పాటు, తల్లిదండ్రులతో స్నేహ సంబంధం పెంచుకుంటు ప్రతి సంవత్సరం కొత్తగా విద్యార్థులను అడ్మిషన్ చేయించడంలో కీలక పాత్ర పోషించి, అన్ని విషయాల్లో సొసైటీ సెక్రటరీ మరియు అధికారుల ఆదేశాలకు అనుగుణంగా తాను పనిచేస్తున్న కాలేజీకి, మంచిపేరు ,గుర్తింపు రావడంలో చేసిన కృషికి గాను, తెలంగాణ మైనార్టీ గురుకుల సొసైటీ సెక్రటరీ ఆదేశాల మేరకు 2025 మైనారిటీ డే మరియు 2025 జాతీయ విద్య దినోత్సవం సందర్భంగా బెస్ట్ లెక్చరర్ అవార్డు రావడం జరిగింది.భద్రాచలం మైనారిటీ గురుకులంలో జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న భద్రాచలం ఎమ్మెల్యే, తెల్లం వెంకట్రావు చేతుల మీదుగా మైనారిటీ పెద్దలు, ప్రిన్సిపాల్ రాజ సమ్మయ్య , తల్లిదండ్రుల సమక్షంలో సిద్దెల రవి కి ఈ అవార్డు అందించి ఘనంగా సత్కరించారు.కార్యక్రమంలో మైనారిటీ అధ్యక్షులు మునాఫ్, సెక్రటరీ జానీ, అబ్దుల్ రహమాన్, వజీర్, బాబా అబ్దుల్లా, భాజీ, మహమూద్, దావూద్, గౌస్ పాషా, రఫీ, హస్సేన్, తల్లిదండ్రులు , లెక్చరర్స్ , టీచర్స్, విద్యార్ధుల తల్లిదండ్రులు పాల్గొని సిద్దెల రవి కి శుభాకాంక్షలు తెలిపారు.
తమ సేవలను గుర్తించి, ఈ అవార్డు అందించిన సెక్రటరీ షఫీ ఉల్లా, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి సంజీవ రావు, ప్రాంతీయ స్థాయి పర్యవేక్షకులు ఏం జే అరుణ కుమారి, ప్రిన్సిపాల్ రాజ సమ్మయ్య లకు సిద్దెల రవి తన వినమ్ర కృతజ్ఞతలు తెలిపారు.