
జనం న్యూస్: నవంబర్ 14 శుక్రవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్;
14 నవంబర్ బాలల దినోత్సవం నీ పురస్కరించుకొని స్థానిక బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్లో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగినది.కార్యక్రమంలో భాగంగా స్వయం పరిపాలన దినోత్సవం పదవ తరగతి విద్యార్థుల ద్వారా నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమం వలన పిల్లల్లో పాఠశాల నిర్వహణ , ఉపాధ్యాయుల బాధ్యతలను ప్రత్యక్షంగా అనుభవంలోకి పొందినారు.పాఠశాల ప్రిన్సిపల్ సంతోష్ కుమార్ , ఉపాధ్యాయ బృందం పాల్గొనడం జరిగినది.