
జనం న్యూస్ నవంబర్ 14 మునగాల
మునగాల మండల వ్యాప్తంగా వారం రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత ప్రారంభమైంది. వాతావరణంలో వచ్చిన ఆకస్మిక మార్పులతో జలుబు, దగ్గు తదితర సమస్యలతో అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుంది.ఈ నెలాఖరు వరకు చలి ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తెల్లవారుజామునే వాకింగ్, వ్యాయామం చేసే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ మూడు నెలల పాటు ఏడు గంటలు దాటిన తర్వాతే వాకింగ్ చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.పిల్లలు, వృద్ధులు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.