
జనం న్యూస్ సూళ్లూరుపేట తిరుపతి జిల్లా
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట లో వాసవి క్లబ్ మరియు వాసవి వనితా క్లబ్ సూళ్లూరుపేట వారి ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా బస్ స్టాండ్ ఎదురుగా గల ప్రభుత్వ బాలుర పాఠశాలలో వ్యాస రచన మరియు వక్తృత్వ పోటీలు నిర్వహించి మొదటి ముగ్గురు విజేతలకు బహుమతులు అందజేసి మిగిలిన విద్యార్థులు అందరికి ఇంగ్లీష్ డిక్షనరీ పుస్తకాలు, నోట్ పుస్తకాలు మరియు స్టేషనరీ కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ అదనపు కోశాధికారి బండారు శబరీష్ గుప్తా, అంతర్జాతీయ కార్యక్రమ సమన్వయకర్త ఉప్పల సాయిరామ్, వాసవి క్లబ్ అధ్యక్షుడు దరిసా గోపి కృష్ణ, కోశాధికారి కొత్తూరు శ్యామ్ సుందర్, వాసవీ క్లబ్ వనిత గత జోన్ చైర్మన్ మురుగుపూడి పద్మజ, జిల్లా V 205 A రీజియన్ VI రీజియన్ సెక్రటరీ సునీత, వనితా క్లబ్ కార్యదర్శి సౌజన్య, పాఠశాల ఉప ప్రధానోపాధ్యాయులు గజేంద్ర , విద్యార్ధిని, విద్యార్థులు పాల్గొన్నారు.
