
మద్నూర్ నవంబర్ 14 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం మేనూర్ లో తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ కాలేజ్ లో నిర్వహించిన బాలల దినోత్సవం వేడుకలలో ముఖ్య అతిథిగా విజయ్ భాస్కర్ రెడ్డి గారు పాల్గొన్నారు. విజయ్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ మన దేశ ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినము ను పురస్కరించుకొని, నెహ్రూ గారు దేశానికి చేసిన సేవలను విద్యార్థులకు తెలియజేశారు. విద్యార్థులకు ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాలలో వృద్ధి సాధించాలని తెలియజేశారు.. ఈ కార్యక్రమం లో తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఎ.వి నర్సగౌడ్ గారు మరియు అధ్యాపక బృందం మరియు . విద్యార్థులు పాల్గొన్నారు.
