
నేటి బాలలే రేపటి పౌరులు
భారతదేశ మొదటి ప్రధాని చాచా నెహ్రూ జయంతి
కొత్తగూడెం నవంబర్14( జనం న్యూస్ ): భారతదేశ మొదటి ప్రధాని చాచా నెహ్రూ జయంతి ఎస్ ఆర్ కె టి స్కూల్ మేదరబస్తి లో నవంబర్ 14 చిల్డ్రన్స్ డే సందర్భంగా జవహార్ లాల్ నెహ్రూ పుట్టినరోజు వేడుకలు ఘనంగా పండుగ వాతావరణంలో నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొత్తగూడెం స్పెషల్ జ్యూడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని భారతదేశ మొదటి ప్రధాని చాచా నెహ్రూ జయంతి శుభాకాంక్షలు తెలియచేసినారు . నేను ఏలకుర్తి గ్రామంలో 1979లో 10వ తరగతి చదువుకున్నానని అనేక కష్టాలు అనుభవిస్తూ సైకిల్ షాపు, వ్యవసాయపు పనులు పనిచేయడం జరిగింది. ఎన్ని కష్టాలు పడ్డ చదువు ఉంటే ఉన్నత స్థానాలకు వెళ్ళవచ్చని ఎస్ ఆర్ కే టి స్కూల్ యాజమాన్యం క్వాలిఫై టీచర్ లతొ మంచి నాణ్యమైన విద్యను అందిస్తున్నారని విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఆటల పోటీలు విద్యార్థుల ఎదుగుదలకు ఉపయోగపడతాయని ఎన్ని కష్టా నష్టాలు వచ్చిన చదువును విడిచిపెట్ట వద్దని ఎస్సార్ కే.టి స్కూల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా చదువు నేర్పిస్తున్నారని మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యాన్ని అభినందించిన మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు . మెజిస్ట్రేట్ చేతుల మీదుగా విద్యార్థులకు ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థి విద్యార్థులకు షీల్డ్ లు బహుమతులు అందజేయడం జరిగింది.అనంతరం స్పెషల్ జ్యూడిషల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లును ఘనంగా శాలువాతో సన్మానించిన ఎస్ ఆర్ కె టి స్కూల్ యాజమాన్యం. ఈ సందర్భంగా ప్రిన్స్ పాల్ స్వర్ణ మాట్లాడుతూ ఏఐ టెక్నాలజీతో విద్యార్థులకు విద్యా అందిస్తున్నామని మంచి క్యాంపస్ ఉన్నది. మంచి టీచర్స్ తో విద్యాబోధన చేస్తున్నాం ముందుముందు రోజులలో ఇంక ఎస్ ఆర్ కె టి స్కూల్ అభివృద్ధి చెందుతుందని అన్నారు . ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు వెంకటరామరాజు జి హెచ్ రామ్ ప్రిన్సిపాల్ టి స్వర్ణ వైస్ ప్రిన్సిపాల్ సోలోమన్ పి ఈ టి జగన్ బిసి జిల్లా అధ్యక్షులు అంకిలేడు ప్రసాద్ స్కూల్ టీచర్లు విద్యార్థి విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.