
జనం న్యూస్ సూళ్లూరుపేట తిరుపతి
తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద సూళ్లూరుపేట బిజెపి నేతలు బీహార్ లో జరిగిన ఎన్నికలలో 243 స్థానాలకు గాను 203 స్థానాలను ఎన్ డి ఏ కూటమి ఘనవిజయం సాధించినధని అందులో 89 స్థానాలు బీజేపీ సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచిన భారతీయ జనతా పార్టీ ఘన విజయాన్ని పురస్కరించుకొని బస్టాండ్ వద్ద విజయోత్సవ సంబరాలను జరుపుకొన్నారు.ఈ కార్యక్రమంలో ఆరని విజయభాస్కర్ రెడ్డి, తాటిపర్తి ఆదినారాయణ,తన్నీరు శేషగిరిరావు, రాచర్ల కృష్ణమూర్తి, నూతలపాటి శ్రీనివాసులు, నాయుడుపేట ఈశ్వరరావు, సురేష్, తడ మండలం తేజ రెడ్డి, మన్నె ముద్దు పద్మజ, పిచ్చుక సూరిబాబు, ఇంగిలాల సాగర్, దుర్గి రమేష్,, పాశం శివ, శశి కుమార్, వెలుగు శ్రీనివాసులు, దొరవారి సత్రం బాలాజీ, మొదలగు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు