
సంగారెడ్డి జిల్లా జనం న్యూస్ ఇన్చార్జ్ బి డివీరేశం జహీరాబాద్, నవంబర్ 14:
జహీరాబాద్ సమీపంలోని మునిపల్లి మండలం అంత్వార్ గ్రామంలో శ్రీ జీవన్ముక్త మహారాజ్ ఉత్సవాలలో భాగంగా శుక్రవారం నాడు శిఖర ప్రతిష్టాపన వైభవంగా జరిగింది. ఈ నెల 14 నుండి 18 వ తేది వరకు కొనసాగే ఈ ఉత్సవాలలో మొదటి రోజు శిఖర స్థాపనలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తి రస కీర్తనలు, పూర్తి ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ ఉత్సవంలో అంత్వార్ గ్రామ ప్రజలతో పాటు మునిపల్లి, సదాశివపేట, సంగారెడ్డి, జహీరాబాద్ కు చెందిన భక్తులు పాల్గొన్నారు. శ్రీ జీవన్ముక్త సంస్థానం బాధ్యులు జ్ఞానేశ్వర్ మహారాజ్ ( బాలరాజు) భక్తుల సౌకర్యార్థం మహాప్రసాదాన్ని వితరణ చేశారు. కాగా శనివారం నాడు జరుగనున్న గరుడ సేవ, ఆదివాటం మహాపూజ, సోమవారం గోపాల కాల చివరి రోజైన మంగళవారం నాడు రథోత్సవ కార్యక్రమం అత్యంత ప్రతిష్టత్మకంగా నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి పొరుగు రాష్ట్రాల భక్తులు సైతం హాజరు కానున్నట్లు మహారాజ్ వివరించారు.