
జనం న్యూస్ నవంబర్ 15 కాట్రేని కొనబీహార్ ఫలితాలే నిదర్శనం:
దేశమంతా మోడీ వెంటే..
బీజేపీ నేత గ్రంధి నానాజీ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో బీజేపీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలు అభివృద్ధి, పారదర్శకత, స్థిరత్వానికి ప్రతీకగా నిలిచిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారి నాయకత్వాన్నే విశ్వసిస్తున్నారని తెలిపారు. మోడీ వారి విధానాలు, దూరదృష్టి, దేశ నిర్మాణంపై ఉన్న నిబద్ధత ప్రజల్లో అపార నమ్మకాన్ని కలిగించాయి. అందుకే ప్రజలు ప్రతిపక్షాలవైపు చూడకుండా, దేశాన్ని ముందుకు తీసుకెళ్లగల శక్తి మోడీ లోనే లోనే ఉందని మరోసారి తేల్చిచెప్పారు అని పేర్కొన్నారు. బీహార్ ఎన్నికల ఫలితాలు ప్రజల అభిప్రాయ దిశను మళ్లీ నిరూపించాయన్నారు. గతంలో ఆటవిక రాష్ట్రంగా ఉన్న బీహార్, గత 15 సంవత్సరాలుగా ఎన్డీఏ పాలనలో అభివృద్ధిపథంలో దూసుకుపోతుంది. పెద్దఎత్తున నిరుద్యోగాన్ని తగ్గించడం, మౌలిక వసతుల అభివృద్ధి, పరిశ్రమల స్థాపన.. ఇవి అన్నీ కేంద్రం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీల వల్లే సాధ్యమయ్యాయి అని ఆయన వివరించారు. ప్రధాని మోడీ బీహార్ అభివృద్ధిపై చూపిన ప్రత్యేక దృష్టితో పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందడంతోపాటు, యువతకు విస్తృతంగా ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయని తెలిపారు. దేశాన్ని వికసిస్తున్న శక్తిగా తీర్చిదిద్దడంలో మోడీ వారి నాయకత్వం కీలక పాత్ర పోషిస్తున్నదని, బీహార్ ఫలితాలు ఆ విశ్వాసానికి మరొక ప్రతీకగా నిలిచాయని నానాజీ చెప్పారు. ఈ సందర్బంగా ఎన్నికల్లో కష్టపడినా ప్రతి కార్యకర్తకు, నాయకుడికి గ్రంధి నానాజీ ధన్యవాదాలు తెలిపారు.