జనం న్యూస్ ఫిబ్రవరి 1 కాట్రేనికోన (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేని కోన మండలం
ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న పల్లంకురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని, అదేవిధంగా విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణాన్ని పూర్తి చేసి తీరుతామని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అన్నారు. శనివారం పల్లంకురు విచ్చేసిన ఆయన ఓఎన్జిసి అధికారులతో కలిసి పీహెచ్సీ భవనాన్ని పరిశీలించారు. ఆసుపత్రి భవన ప్రస్తుత పరిస్థితిపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అవసరమైన నిధులు వెంటనే మంజూరు అవుతాయని దీంతో నిర్మాణం పూర్తవుతుందని భరోసా ఇచ్చారు. అదేవిధంగా దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి సంబంధించి త్వరలో పనులు ప్రారంభమవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగిడి నాగేశ్వరరావు,ఆకాశం శ్రీనివాస్,కంచు స్తంభంకృష్ణ, ఇసుక పట్ల వెంకటేశ్వరరావు, రేవు తిరుపతిరావు, వాసంశెట్టి రాజేశ్వరరావు, మంతెన సూరిబాబు, టీవీ బాబాయ్, ఇసుక పట్ల రాంబాబు, పెనుమత్స రామరాజు, ఓఎన్జిసి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు