జనం న్యూస్ ఫిబ్రవరి 1
శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని మార్కండేయ స్వామి దేవాలయంలో మార్కండేయ స్వామి వారి జయంతి వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యేకు ఆలయ ప్రధాన అర్చకులు మార్త రాజ్ కుమార్, అర్చకులు మార్త పవన్ కుమార్, వంగరి సుధీర్ లు, ఎమ్మెల్యేకు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఆలయాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. మార్కండేయ స్వామి ఆలయ అభివృద్ధికి తన వంతుగా సహకారం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కందకట్ల రవి మాజీ ఎంపీపీ బాసాని చంద్రప్రకాష్ కాంగ్రెస్ నాయకులు చిందం రవి బాసాని మార్కండేయ దుబాసి కృష్ణమూర్తి చింతల రావిపాల్ తదితరులు పాల్గొన్నారు….