
.!జనంన్యూస్. 17.నిజామాబాదు..
ఈనెల 20 నుండి 23 తేదీ లో పంజాబ్ జలాంధ్రలో జరిగే జాతీయ స్థాయి టైక్వాండ పోటీలకు నిజామాబాద్ అసోసియేషన్ క్రీడాకారులు సిద్ధార్థ ,భవ్య, సాయి ప్రసన్న ,అనన్య, అభిరామ్, సాయి దీక్షిత్ ఎంపికైనట్లు టైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి మనోజ్ కుమార్ తెలిపారు. ఈరోజు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మీ గారు పంజాబ్ లోని జలంధర్ లో జరిగే జాతీయస్థాయి క్రీడలకు ఎంపికైనందుకు వారిని వారి మెడల్స్ తో అభినందించారు జాతీయ స్థాయిలో కూడా వారు మెడల్స్ తీసుకురావాలి జిల్లాకి మంచి పేరు తీసుకురావాలి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి అని వారిని అభినందించారు ముఖ్యంగా ఆడపిల్లలు టైక్వాండో లాంటి విద్య నేర్చుకోవాలి వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని శారీరకంగా మానసికంగా వారు అనుకున్నది సాధించే స్థాయికి వారు ఎదగాలని తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వారు ముందుకు వెళ్తున్నందుకు తల్లిదండ్రులకు అభినందనలు తెలుపుతూ కోచ్ మనోజ్ కి రానున్న కాలంలో జిల్లాకెన్నో జాతీయస్థాయిలో కూడా పథకాలు తీసుకురావాలనీ కోరారు.