
:జనం న్యూస్, నవంబర్ 17,అచ్యుతాపురం:
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఎలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం లోగల శిల్పా లే అవుట్ నందు ఎలమంచిలి నియోజకవర్గ వన భోజన కార్యక్రమం మరియు మండల, క్లస్టర్,యూనిట్, బూత్, గ్రామ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా క్లస్టర్ ఇంచార్జిగా పూడిమడక గ్రామానికి చెందిన కోవిరి బంగారయ్యను నియమించడంతో ప్రమాణ స్వీకారం చేశారు.పార్టీ బాధ్యతను అప్పజెప్పినందుకు ఎలమంచిలి నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు,మాజీ ఎంపీ పప్పల చలపతిరావు,మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లాలం భవాని భాస్కర్ కు ధన్యవాదాలు తెలిపారు.బంగారయ్యను స్థానిక నాయకులు మరియు కార్యకర్తలు పుష్ప గుచ్చాన్ని అందించి శాలువాతో సత్కరించి అభినందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా టీఎన్టీయుసి అధ్యక్షులు పొనమళ్ళ కొండబాబు,గ్రామ నాయకులు మేరుగు అప్పలనాయుడు, ధోని కాసుబాబు మరియు తదితరులు పాల్గొన్నారు.
