
:జనం న్యూస్, నవంబర్ 17,అచ్యుతాపురం:
అచ్యుతాపురం మండలం చోడపల్లి గ్రామానికి చెందిన జంగాల కాలనీ యువకుడు టి. ప్రసాద్ వారం రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ప్రస్తుతం అనకాపల్లి బెనర్జీ హాస్పిటల్లో ఐసీయూ విభాగంలో చికిత్స పొందుతున్నాడు.అచ్యుతాపురం,రాంబిల్లి మండలాల జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ముందుకు వచ్చి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయంగా రూ.15వేలు చెక్కును అందజేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దాతలు ముందుకు వచ్చి సాయం అందించి పేద కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలనికోరారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పుర్రె రవిచంద్ర యాదవ్,ఎరిపల్లి ముత్యాలు, జాయింట్ సెక్రటరీ ఆదాడ చిన్న, క్యాషియర్ వసాది ఉదయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.