జనం న్యూస్ -ఫిబ్రవరి 1- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:-
విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎంఈఓ తరి రాము అన్నారు. నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ బస్టాండ్ సమీపంలో ఉన్న ప్రాథమిక ఉన్నత పాఠశాలను శనివారం సందర్శించి విద్యార్థుల హాజరు శాతాన్ని, విద్యార్థులకు బోధిస్తున్న పాఠ్య అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో బోధన శిక్షణ తీసుకున్న ఉత్తమ ఉపాధ్యాయులతో విద్యను అందించడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు గణేశ్వరి వారి తండ్రి లక్ష్మయ్య జ్ఞాపకార్థం విద్యార్థులకు 5000 రూపాయలతో తయారు చేసిన బ్యాడ్జీలు బెల్టులను విద్యార్థులకు అందజేశారు .అనంతరం పాఠశాలలో అటెండర్ గా విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందిన అటెండర్ నీలమ్మను శాలువా పూలమాలతో సన్మానించారు .ఈ కార్యక్రమంలో మండల నోడల్ ఆఫీసర్ శేషు ఉపాధ్యాయులు రమణి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.