Listen to this article

జనం న్యూస్‌ 18 నవంబర్‌, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ

పట్నాయక్‌నిన్న భీమిలి నియోజకవర్గం లోని 6 వార్డు ప్రతినిధి పోతిన ప్రసాద్ (గురు స్వామి) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంబలం పూజ ఆహ్వానం మేరకు ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వైయస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయ కర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) *కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ* సోమవారం పాల్గొని అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడ గురు స్వామి ఆశీర్వాదం పొందారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు,చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షుడు తోట వాసు, చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.