
జనం న్యూస్ నవంబర్ 18 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో చిట్కూల్ మరియు బండపోతుగల్ పిపిసి సెంటర్ను ఏవో రాజశేఖర్ సందర్శించడం జరిగింది.వారు మాట్లాడుతూ రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్లోనే ధాన్యం అమ్మాలని సూచించారు.ధాన్యంలో తేమ శాతం 17% మించి ఉండరాదని, ధాన్యం ఆరిన తర్వాత తాళ్ళు, మట్టి పెళ్ళాలు లేకుండా నాణ్యమైన వితానాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ అనిత, కృష్ణవేణి సెంటర్ ఇన్చార్జి రవి, నర్సింలు మరియు రైతులు మీర్జా హుస్సేన్ బేగ్, మల్లా రెడ్డి, సయ్యద్ హుస్సేన్ ,పోచయ్య, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నా రు