
జనం న్యూస్, నవంబర్ 19 ( ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
మత్తు యువత జీవితాలను చిత్తు చేస్తుందని కాట్రేనికోన ఏఎస్ఐ సత్య నారాయణ పేర్కొన్నారు. డ్రగ్స్ రహిత భారతావనిని నిర్మించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం విజయ వం తానికి ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం కాట్రేనికోన జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏ ఎస్ఐ సత్యనారాయణ మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు యువత సహకరించాలని ఆయన కోరారు. నూటికి నూరుపాళ్ళు విద్యార్థిని విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. యువత మత్తుకు బానిసలై తమ జీవితాలను పాడు చేసుకోకూడదనే ఉద్దేశంతోనే నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వ హించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమం మమ్మిడివరం సిఐ ఎమ్ మోహన్ కుమార్ అధర్వంలో కాట్రేనికోన ఎస్ఐ అవినాష్ పర్యవేక్షణలో విద్యార్థులకు అవగాహన కల్పించామని ఏఎస్ఐ సత్యనారాయణ తెలిపారు, ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
