
19.11.2025, బుధవారం కందుకూరు నియోజకవర్గం
78.50 లక్షల రూపాయల పనులకు శంకుస్థాపన..
కందుకూరు పట్టణం 7 వ వార్డు పరిధిలో శివసాయి పబ్లిక్ స్కూల్ నుంచి వాసవి నగర్ కల్వర్టు వరకు 78.5 లక్షలతో కొత్తగా నిర్మించబోతున్న వరదనీటి కాలువ పనులకు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఈరోజు శంకుస్థాపన చేశారు. మున్సిపల్ కమిషనర్ కే. అనూష, పట్టణ టిడిపి అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు సహా పలువురు నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. . అనంతరం ఎమ్మెల్యే నాగేశ్వరరావు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కందుకూరు పట్టణంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కందుకూరు వచ్చినప్పుడు ఇక్కడ సమస్యలను వివరించగా, పట్టణ అభివృద్ధి కోసం 50 కోట్ల రూపాయలు ప్రకటించిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన ఏడాదిన్నర సంవత్సరంలో 20 కోట్ల రూపాయల విలువైన పనులు జరుగుతున్నాయని తెలియజేశారు. ప్రస్తుతం పట్టణంలో రోడ్ల వెడల్పు కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో, ట్రాఫిక్ సమస్య నివారణకు తోపుడు బండ్ల వ్యాపారులు సహకరించాలని ఎమ్మెల్యే నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ప్రధాన రోడ్ల వెంబడి ఖాళీగా ఉన్న స్థలాల్లో తోపుడు బండ్లు పెట్టుకొని వ్యాపారాలు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. చిన్న చిన్న వ్యాపారాలన్నీ ఒకే చోట ఉండేలా నెల్లూరు పట్టణంలో ప్రత్యేకంగా స్మార్ట్ బజార్ ఏర్పాటుచేసిన విషయాన్ని ఎమ్మెల్యే ఈ సందర్భంగా ప్రస్తావించారు. తన సూచనలతో కందుకూరు మున్సిపల్ కమిషనర్ అనూష గారు నెల్లూరు వెళ్లి స్మార్ట్ బజార్ ను పరిశీలించి వచ్చారని చెప్పారు. అలాంటి స్మార్ట్ బజార్ ను త్వరలో కందుకూరులో ఏర్పాటు చేసే ఆలోచన ఉందన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ, సంక్షేమ పథకాలు అమలు కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కష్టపడుతున్నారని ఎమ్మెల్యే నాగేశ్వరరావు తెలిపారు. అనంతరం అక్కడ అదే ప్రాంతంలో రోడ్డుకు దక్షిణం వైపు 74 లక్షలతో నిర్మిస్తున్న వరదనీటి కాలువ పనులను ఎమ్మెల్యే పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అభివృద్ధి పనుల నాణ్యత విషయంలో రాజీ లేకుండా పనులు చేయించాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు ఘన స్వాగతం పలికారు..ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ గణపతి, కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు బుస్సారెడ్డి కృష్ణారెడ్డి, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చిలకపాటి మధుబాబు, రాష్ట్ర విద్యాశాఖ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పోకూరి రాంబాబు, పార్టీ నాయకులు పిడికిటి వెంకటేశ్వర్లు, కండ్రా మాల్యాద్రి, చల్లా నాగేశ్వరరావు, వడ్డెళ్ళ రవిచంద్ర, చదలవాడ కొండయ్య,మహర్షి శీను, గడ్డం మాలకొండయ్య, షేక్ మున్నా, షేక్ సలాం, షేక్ రూబీ, సయ్యద్ గౌస్ బాషా, జియావుద్దీన్, షేక్ ఫిరోజ్, ముచ్చు శ్రీను, మోదడుగు వెంకటేశ్వర్లు, మురారిశెట్టి సుధీర్, కొత్తూరు వెంకట సుధాకర్, తల్లపనేని రవీంద్ర, కాంట్రాక్టర్ వడ్డేవల్లి వెంకటరావు మరియు అన్ని వార్డు అధ్యక్షులు కూటమి పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు..