
జనం న్యూస్ ; నవంబర్ 19 బుధవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;
58 వ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా జిల్లా కేంద్ర గ్రంథాలయం సిద్దిపేటలో ఆదివారం కవి సమ్మేళనం జరిగింది. కథాశిల్పి ఐతా చంద్రయ్య మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన సౌదాలని, కవులతో సమాజ చైతన్యం కలుగుతుందని, సాహిత్య స్పూర్తి ప్రతివారిలో ఉండాలన్నారు. కవి అమ్మన చంద్రారెడ్డి మాట్లాడుతూ భాషాదోషాలు లేకుండా రచనలు ఉండాలని, గ్రంథాలయాలలో కవి సమ్మేళనం ఏర్పాటు చేయడం సంతోషమన్నారు. సింగీతం నరసింహారావు రచించిన నరసింహ శతకం అవిష్కరించారు. కవులు ఉండ్రాళ్ళ రాజేశం, సింగీతం నరసింహారావు, కాల్వ రాజయ్య, పిన్నింటి మహేంద్రారెడ్డి, అజయ్ కుమార్, ఉప్పరి బాలచంద్రం, అన్నలదాసు రాములు, కె.రాజు, దాసరి రాజు, ముజఫర్, మల్లయ్య తదితరులు పాల్గొన్ని పద్యాలు కవితలతో అలరించారు.