
ఆర్ శివ చరణ్,
జనం న్యూస్,నవంబర్ 19,కంగ్టి,
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో నిర్వహించిన సైన్స్ ఫెయిర్ సదస్సులో ఆర్ శివ చరణ్,పదవ తరగతి విద్యార్థి తనా స్వంత నైపుణ్యంతో మల్టీపర్పస్ అగ్రికల్చరల్ స్ప్రింకలర్ మాషిన్ వ్యవసాయదారులకు ఉపయోగకరమైఏ విధంగా తయారు చేయడం జరిగిందని అన్నారు.ఈ సందర్భంగా విద్యార్థి మాట్లాడుతూ వ్యవసాయం సాగు చేసే రైతన్నలు తమ పంట పొలాల్లో మొక్కలకు నీరు అందించడానికి సులభమైన పద్ధతిలో నీరు అందించడానికి మొక్కకు కావలసిన మోతాదులు నిరంబించడానికి ఈ యంత్రం పనిచేస్తుందని అన్నారు. ఈ యంత్రాన్ని ఉపయోగించడంతో రైతులకు ఎటువంటి వైపులు,స్పిన్క్లర్లు, అవసరం లేదని అన్నారు.ఈ యంత్రంతో నీటిని ఆదా చేయడంతో పాటు,తక్కువ వ్యయంతో పంటను సంరక్షించుకోవచ్చని అన్నారు.ఈ యంత్రంతోనే పంటకు మందు స్ప్రే చేసుకోవచ్చు అని అన్నారు.ఈ పరికరం తయారు చేయడానికి 5000 రూపాయలు మాత్రమే పెట్టుబడి పెట్టడం జరిగిందని అన్నారు.ఈ యంత్రం మన పంట పొలాలకు మందు సంచులు, పంట పొలం నుంచి ధాన్యపు సంచులు, పశుగ్రాసము, తీసుకురావడానికి ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.
