
జనం న్యూస్ నవంబర్ 19 ముమ్మడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
ఝాన్సీ లక్ష్మీబాయి లోని ధైర్యం, సాహసం, క్రమశిక్షణను ఆదర్శంగా తీసుకుని విద్యార్థిని విద్యార్థులు తమ జీవితాలను ఆదర్శవంతంగా మలుచుకోవాలని ఎస్ కే బి ఆర్. బీఈడీ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ జి.ఏ. శ్రీనివాస్ అన్నారు. ఈరోజు ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా బిఈడి కళాశాల లో జరిగిన ఒక కార్యక్రమంలో శ్రీనివాస్ మాట్లాడుతూ ఝాన్సీ లక్ష్మీబాయి ప్రధమ స్వాతంత్ర సంగ్రామం లో, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిపిన పోరాటం మరువలేనిదని అన్నారు.90 సంవత్సరాలు పాటు జరిగినటువంటి భారత స్వాతంత్ర సం గ్రామానికి ఇది ఊపిరి పోసినది అన్నారు.ఆమె దైనందిన జీవితం విద్యార్థిని విద్యార్థులకు ఆదర్శం అన్నారు. ముందుగా ఝాన్సీ లక్ష్మీబాయి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత చరిత్ర పై వ్యాసరచన పోటీలు మరియు భారతీయ మహిళ- ప్రపంచానికి ఆదర్శం అనే అంశంపై వతృత్వ పోటీలను నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందించారు ఈ కార్యక్రమంలో కళాశాల ఆంగ్ల అధ్యాపకురాలు ఏ ఎన్ ఎల్ దేవి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.