
జనం న్యూస్ 20 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ
పట్నాయక్విజయనగరం మహిళా పోలీసు స్టేషనులో 2022సం.లో నమోదైన వేధింపుల కేసులో నిందితుడికి 1సం.జైలు, రూ. 500/- జరిమానా విధిస్తూ విజయనగరం జె.ఎఫ్.సి.ఎం. (స్పెషల్ మొబైల్ కోర్టు) న్యాయమూర్తి కుమారి పి.బుజ్జి గారు తీర్పు వెల్లడించినట్లుగా విజయనగరం మహిళా పిఎస్ డిఎస్పీ ఆర్.గోవిందరావు నవంబరు 19న తెలిపారు.వివరాల్లోకి వెళ్ళితే.. విజయనగరం పట్టణంకు చెందిన కలిశెట్టి సుజాతకు విజయనగరం పట్టణంకు చెందిన కలిశెట్టి వీరబాబుతో 11 సం॥ల క్రితం వివాహం అయ్యిందని, వారికి ఒక కుమార్తె జన్మించిందన్నారు. తన భర్త వీరబాబు వాటర్ సర్విసింగ్ పని చేస్తూ ఉంటాడని, మద్యానికి బానిసై ప్రతిరోజు మద్యం సేవించి శారీరకంగా, మానసికంగా వేధింపులకు పాల్పడేవాడని, తే. 05-11-2022దిన మద్యం సేవించి తనతో గొడవపడి గాయపరిచాడని మహిళా పోలీసు స్టేషనులో తే. 06-11-2022 దిన ఫిర్యాదు చేసారు. కలిశెట్టి సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహిళా పిఎస్ ఎస్ఐ కె. వి. నరసింహారావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసి, నిందితులను అరెస్టు చేసి, కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేసారన్నారు.కోర్టు విచారణలో భర్త కలిశెట్టి వీరబాబు శారీరకంగా, మానసికంగా వేధింపులకు పాల్పడినట్లుగా రుజువు కావడంతో నిందితు కలిశెట్టి వీరబాబుకి 1సం. జైలు శిక్ష, రూ. 500/- జరిమానా విధిస్తూ విజయనగరం జె.ఎఫ్.ఎం.సి. (స్పెషల్ మొబైల్ కోర్టు) న్యాయమూర్తి తీర్పు వెల్లడించారని మహిళా పిఎస్ డిఎస్పీ ఆర్.గోవిందరావు తెలిపారు. ఈ కేసు లో పోలీసువారి తరుపున ఎపిపి విజయలక్ష్మి వాదనలు వినిపించగా, కేసును ఎస్ఐ కె. వి. నరసింహారావు దర్యాప్తు చేయగా ,కోర్టు కానిస్టేబులు వై.పూర్ణ సాక్షులను సకాలంలోకోర్టులో హాజరుపర్చారని మహిళా పిఎస్ డిఎస్పీ ఆర్.గోవిందరావు తెలిపారు.