
జనం న్యూస్
నిరుపేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు
ఆమె జయంతి సందర్భంగా ఘన నివాళులు
దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ దేశం కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. బుధవారం ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా శాయంపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ క్రమంలో స్థానిక నాయకులతో కలిసి బుచ్చిరెడ్డి ఇందిరాగాంధీ చిత్రపటానికి మాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బుచ్చిరెడ్డి మాట్లాడుతూ ఇందిరాగాంధీ ప్రజల సౌకర్యార్థం బ్యాంకులను జాతీయకరణం చేసి జాతికి అంకితం చేశారన్నారు. దేశవ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు నిర్మించి భూమిలేని వారికి భూమి పంచి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని గుర్తు చేశారు. ఇందిరమ్మ ఆశయాలకు అనుగుణంగానే రాష్ట్రంలో ప్రజా పాలన జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వైనాల కుమారస్వామి, చిందం రవి, నిమ్మల రమేష్, బాసని మార్కండేయ, బాసని రవి, మారపల్లి కట్టయ్య, పలుపదాసు వెంకటరమణ, ఎండి రఫీ, వీరన్న తదితరులు పాల్గొన్నారు.