
జనం న్యూస్ నవంబర్ 20 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన
పాడి రైతులకు గురువారం దాన పంపిణీ చేశారు. కందికుప్ప పిఎసిఎస్ చైర్మన్ నూకల వి వి ఎస్ ఎన్ వి ప్రసాద్ ( మూర్తి) ఆధ్వర్యం లో ఈ పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డా బి. నాగేశ్వరరావు ముఖ్య అతిథి గా విచ్చేసి ఈ పశువుల దాణ వల్ల పశువులకు పాల ఉత్పత్తి పెరుగుతుంది అనిచెప్పారు. ఈ కార్యక్రమంలో గేద్దనపల్లి పిఎసిఎస్ చైర్ పర్సన్ వనచర్ల నాగేశ్వరరావు, కందికుప్ప పశు వైద్య అధికారి పి. సుధీర్ గేద్దనపల్లి పశు వైద్య అధికారి ఎం. వెంకట రమణ, పల్లం ఏ హెచ్ ఏ డి సాయి కుమార్, కే. వెంకటరమణ, పీ ఏ సి ఎస్ సీఈఓ యర్రంశెట్టి రామచంద్రరావు , సంఘ సిబ్బంది , మల్లాడి కృష్ణ మూర్తి, యర్రంశెట్టి గంగాధరన్, గొల్లపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.