
జనం న్యూస్ 20 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
జోగులాంబ గద్వాల్ జిల్లా అల్లంపూర్ తాలూకా జననేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఐజ కాంగ్రెస్ శ్రేణులు ఏఐసీసీ కార్యదర్శి మాజీ శాసనసభ్యులు ,నడిగడ్డ దళిత జాతి ముద్దుబిడ్డ పేద ప్రజల ఆశా కిరణం.. *డాక్టర్ సంపత్ కుమార్* జన్మదిన వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తనూరు జయన్న ఆధ్వర్యంలో ఈరోజు ఐజ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు.అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న అనేక మంది రోగులకు పండ్లను పాలను పంపిణీ చేసి జననేత జన్మదినాన్ని ఆదర్శవంతంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జయన్న మాట్లాడుతూ ...ఒక మారుమూల గ్రామంలో జన్మించిన సంపత్ కుమార్ ఈరోజు జాతీయస్థాయిలో ఎఐసిసిగా పేరుగాంచి రాహుల్ గాంధీ , మల్లికార్జున్ కార్గే ల మన్ననలతో రాష్ట్రంలో పార్టీకి విదేయా నాయకుడిగా దళిత జాతి ఆశ కిరణమై జనహృదయనేతగా పేరు తెచ్చుకున్నాడని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్పతోపాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, సర్పంచులు, మాజీ సర్పంచులు ,ఎంపీటీసీలు కౌన్సిలర్లు, ముఖ్య కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.