
జనం న్యూస్, నవంబర్ 20,అచ్యుతాపురం:
అచ్యుతాపురం శాఖా గ్రంధాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల బహుమతి ప్రధానోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ బి చిన్నారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్ననాటి నుండే గ్రంథాలయాలకు వెళ్లి మంచి పుస్తకాలు చదవడం ద్వారా మానసిక వికాసం మంచి పరిజ్ఞానం పొంది ఉన్నఠ స్థాయికి ఎదగడానికి అవకాశం ఉందని, మనకు కావలసిన పుస్తకం కోసం సందర్శిస్తే అనేక అమూల్యమైన పుస్తకాలు తారసపడతాయని అవి చదవడం ద్వారా విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రులకు సమాజానికి మంచి పేరు తీసుకొచ్చిన వాళ్ళు అవుతారని అన్నారు. మండల విద్యాశాఖ అధికారి సిఆర్కే దేవరాయలు మాట్లాడుతూ ప్రపంచ మేధావులు అందరూ కూడా గ్రంథాలయాలను ఉపయోగించుకొని ఉన్నత స్థాయికి ఎదిగారని మహాత్మా గాంధీ,డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సివి రామన్ వంటి గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు చదవడం ద్వారా మనం స్ఫూర్తిని పొంది ఉన్నత స్థాయికి ఎదగవచ్చని వారోత్సవాలలో వివిధ పోటీలలో పాల్గొన్న విద్యార్థులందరూ పట్టు విడవకుండా ఇంకా మంచి పోటీలలో పాల్గొని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు.ఈ కార్యక్రమంలో అచ్యుత విద్యాసంస్థల అధినేత పి శ్రీశేషగిరిరావు,రిటైర్డ్ హైస్కూల్ హెచ్ఎం కుసుమ కుమారి పాల్గొని వివిధ పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు. సిఆర్పిలు రాజారావు, గ్రంథాలయ అధికారి ఎల్వి రమణ,తిమ్మరాజుపేట గ్రంధాలయ అధికారి కోటేశ్వరరావు, పాఠకులు శివకృష్ణ,రాజేష్ మరియు వివిధ పాఠశాలల విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
