
జనం న్యూస్ 20జహీరాబాద్ నియోజకవర్గం
లోని కోహిర్ మండలం దిగ్వాల్ గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డెక్కన్ టోల్వేస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత నియమాలపై అవగాహన సదస్సు నిర్వహించారు విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాలు సూచించారు మరియు వేగ నియంత్రణ మద్యం సేవించి వాహనం నడపడం వల్ల కలిగే నష్టాలు గురించి విద్యార్థులకు క్లుప్తంగా వివరించారు మరియు విద్యార్థులతో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు రహదారి భద్రతా ప్రతిజ్ఞరహదారి నాగరికతకు చిహ్నంప్రయాణం ప్రగతికి సంకేతం సాంకేతిక యుగ వారసులమైన మనకుప్రయాణం ఒక తప్పనిసరి అవసరం రోడ్డనేది రకరకాల వాహనాలు వేగంగా సాగిపోయే ఓ ప్రదేశం. అలాంటి రోడ్లపై మనం అడ్డదిడ్డంగా నడిపినా లేదా అజాగ్రత్తగా వాహనాలను నడిపినా ఆది అనేక అనర్ధాలకు దారితీస్తుంది. అలాంటి ప్రవర్తన ఇతరులకేగాక మనకూ హాని చేస్తుందిరోడ్లపై జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏమిటో మనం తప్పక తెలుసుకొని తీరాలి. లేకపోతే అది మన ప్రాణాలకే ముప్పుగా మారవచ్చు. ముఖ్యంగా రోడ్లనేవి వాహనాల కోసమే గానీ మనుషులు నడిచేందుకు కాదు అన్న విషయాన్ని మనం బాగా గుర్తుంచుకోవాలి. వివిధ వాహనాలు వేగంగా ముందుకు సాగుతుంటాయిఅలాంటి స్థితిలో మనం హఠాత్తుగా రోడ్లపైకి వెళితే ఆయా వాహనాలు నడిపేవారికి వాటిని అదుపుచేయడం చాలా కష్టమవుతుంది. అందుకని రోడ్లు దాటేటప్పుడు గానీ, రోడ్ల వెంట నడిచేటప్పుడు గానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. రోడ్డుకి అటు పక్కనా ఇటు పక్కనా ఫుట్‌పాత్ లేదా కాలిబాట అనేది ఉంటుంది కదా! మనం నడిచేటప్పుడు దాని పైననే నడవాలి. ఆ ఫుట్‌పాత్‌లను పాదచారుల కోసమే అంటే నడుస్తూ వెళ్లే వారి కోసమే నిర్మిస్తారు. రోడ్లపై మీరు సురక్షితంగా ఉండాలంటే ఈ కింది సూత్రాలను తప్పక పాటించాల్సి ఉంటుందిరోడ్డుకి ఎప్పుడూ ఎడమవైపునే ఉండండి ఎల్లప్పుడూ ఫుట్‌పాత్ పైనే నడవండి ఒకవేళ ఫుట్‌పాత్ లేకపోతే రోడ్డుకు ఓ పక్క నుంచి నడవండిరోడ్డుపై నడిచేటప్పుడు చదవడం గానీ ఆడడం గానీ చేయకండిరోడ్డుని దాటేటప్పుడు జీబ్రా క్రాసింగ్ ఉన్న చోటనే దాటండిరోడ్డుని దాటేటప్పుడు పరిగెత్తకండిరోడ్డుని దాటేటప్పుడు దాటడానికి ముందుగా మీ కుడివైపు ఆ తరువాత సగం దాటాక మీ ఎడమవైపున ఉన్న రోడ్డుని జాగ్రత్తగా గమనించండి ఒకవేళ ఏ రోడ్డునైనా దాటడానికి భయంగా అనిపిస్తే ఎవరినైనా పెద్దవారిని సాయం అడగండి లైటు రంగుల్ని గమనించండి ఎర్ర లైటు వేసి ఉంటే ఆగండి ఆకుపచ్చ లైటు ఉంటే ముందుకు వెళ్లండి అని సూచించారు ఈ కార్యక్రమంలో రూట్ పెట్రోలింగ్ సిబ్బంది పాల్గొన్నారు
