
:జనం న్యూస్,నవంబర్ 20,అచ్యుతాపురం
:సీఐటీయూ మహాసభలను జయప్రదం చేయాలని స్థానిక సెజ్ లో ఉన్న కార్మికులతో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శంకరరావు మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయటం లేదని,సామాజిక భద్రత సౌకర్యాలు అమలు కావటం లేదని,విద్యుత్తు,బ్యాంకులో తదితర సంస్థల్లో ప్రైవేటీకరణ విధానాలు వేగంగా అమలు చేస్తుందని,కార్మిక హక్కులు కాలరాసే లేబర్ కోడులను తీసుకువచ్చిందని,ముఠా కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని జరిగే సీఐటీయూ అఖిల భారత 18వ మహాసభలు మొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నంలో 2025 డిసెంబర్ 31 నుండి 2026 జనవరి 4 వరకు జరుగుతున్నాయని ఈ మహాసభలు 22 రాష్ట్రాల నుండి 2 వేల మంది ప్రతినిధులు జనవరి 4న లక్ష మందితో భారీ బహిరంగ సభ జరుగుతుందని,ఈ మహాసభల జయప్రదానికి కార్మికులందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఆర్ రాము,గురుజాపాలెం ముఠా సంఘం మేస్త్రి ఎస్ రాము, తాతారావు,నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.