
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 20
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన ఉద్యమకారులకు విద్యా ఉపాధి రాజకీయ రంగాలలో ప్రాధాన్యత ఇవ్వాలి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు పి. రాములు నేత
జాగో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సమావేశం గౌరవనీయులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్ర తొలి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పిలమర్తి రవి గారి ఆధ్వర్యంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఉద్యమకారులు అందరు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన ఉద్యమకారులకు ప్రభుత్వం ప్రకటించిన 250 గజాల స్థలము పెన్షన్ మరియు విద్యా ఉపాధి రాజకీయ రంగాలలో ప్రాధాన్యత కల్పించాలని సమావేశం తీర్మానించింది ఈ సమావేశంలో పాల్గొన్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పి.రాములు నేత మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులు బిచ్చగాళ్లు కాదు ఈ రాష్ట్రాన్ని సాధించిన యజమానులు అడుక్కోవడం మానేసి ఈ రాష్ట్రంలో ఎక్కడ మిగులు భూమి ఉన్న ఆ భూమిలో ఐదు ఎకరాల భూమి పట్టణాలలో నివాస స్థలము మరియు స్వాతంత్ర సమరయోధుల మాలే ప్రత్యేక పెంచను ఇవ్వాలని డిమాండ్ చేశారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల అదృష్టవంతులని తెలంగాణ రాష్ట్ర ప్రజలు మూడు ఉద్యమాలు చూసినారని రెండు స్వతంత్ర ఉద్యమాలు ఒకటి స్వతంత్ర రాష్ట్ర ఉద్యమం ఆనాడు స్వతంత్ర సంఘ గ్రామంలో స్వాతంత్ర సమరయోధులకు ఆనాడు రాజకీయాలలో ప్రత్యేక స్థానం ఉండేదని అన్నారు దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత పార్లమెంటులో స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న వారు 80 శాతం మంది పార్లమెంట్ సభ్యులుగా ఉండేవారని ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారులు 10% కూడా లేకపోవడం బాధాకరం శోచనీయాంశమని అన్నారు రాబోయే రోజులలో ఉద్యమకారులు పెద్ద ఎత్తున ఏకమై అస్సాం ఘన పరిషత్ వలే ఈ రాష్ట్రాన్ని సాధించుటలో ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్న నా ఉస్మానియా విద్యార్థి నాయకులు ఈ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయాలి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని అన్నారు ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఉస్మానియా విద్యార్థులకు అంకితం అని అన్నారు ఈ రాష్ట్రం కోసం అనేకమంది అనేక రకాల పోరాటం చేసి సాధించి వాళ్ల ప్రాణాలను ధనమును సమయాన్ని వారందరిపై వారందరిసంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని అన్నారు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి విద్యార్థి ఉద్యమ నాయకులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకులు పాల్గొన్నారు