
సీఐ ఆర్ వివిఎస్ఎస్ చంద్రశేఖరరావు
జనం న్యూస్, నవంబర్ 20,అచ్యుతాపురం:
కొత్త క్రిమినల్ చట్టాలపై స్థానిక సీఐ ఆర్ వివిఎస్ఎస్ చంద్రశేఖరరావు అచ్యుతాపురం మండలం పూడిమడక ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు.ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ కొత్త క్రిమినల్ చట్టాల పై అవగాహన అవసరమని,పాత చట్టాలు స్థానంలో కొత్త చట్టాలు రావడం జరిగిందని, భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం చట్టాలపై పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని సూచించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,విద్యార్థులు,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.