
జనంన్యూస్.20.సిరికొండ. ప్రతినిధి. శ్రీనివాస్.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండల కేంద్రంలోని పాకాల గ్రామానికి వచ్చిన మంత్రి సీతక్కకు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే మొన్న కురిసిన అకాల వర్షాలకు మండలంలోని రాకపోకలకు ఇబ్బందులు అవుతున్నాయని రోడ్లన్నీ చెడిపోయినవని వీటిని కొంచెం దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు.
తూంపల్లి,పాకాల గ్రామాల మధ్య బ్రిడ్జి కొరకు నిధులు మంజూరు చేయాలని 20 కోట్ల సి ఆర్ ఆర్ 2025-26 నిధులు మంజురు చేయాలనీ మంత్రి సీతక్క కు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి వినతిపత్రం అందజేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం 170 గ్రామపంచాయతీలు, ఏడు మండలాలు ఉన్నాయని, నిజామాబాద్ జిల్లాలో అతిపెద్ద విస్తీర్ణం, రోడ్లను కలిగి ఉందని అన్నారు. గరిష్టంగా ఎస్సీ మరియు ఎస్టీ నివాసాలు తండా లకు శాశ్వతం బి టీ రోడ్డు లేవని, సరైన రోడ్డు లేకపోవడంతో రవాణా చాలా ఇబ్బంది ఎదుర్కొంటుందని అన్నారు. ఇటీవల భారీ వర్షాల కారణంగా గరిష్ట సంఖ్యలో మట్టి ఉపరితల రోడ్డు దెబ్బతిన్నాయని అన్నారు. అందుకోసం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి సి ఆర్ ఆర్ 2025-26 గ్రాంట్ కింద పరిపాలన అనుమతి కోసం 15 పనుల కొరకు 20 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కూడిన పనులను చేయటానికి నిధులు మంజూరు చేయాలని మంత్రి సీతక్క కు కోరారు. మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించి, త్వరలో నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు..
సిరికొండ మండలం పాకాల గ్రామానికి చెందిన మాలవత్ పూర్ణ తండ్రి ఇటీవల మరణించడం జరిగింది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క , నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ లు మానవత్ పూర్ణ ను, వారి కుటుంబ సభ్యులలో పరామర్శించడం జరిగింది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంతకుముందు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రరేకులపల్లి భూపతిరెడ్డి జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క కు తూంపల్లి, పాకాల గ్రామానికి వెళ్లి రహదారికి బ్రిడ్జ్ కావాలని, బ్రిడ్జ్ కు కావలసిన విధులు మంజూరు చేయాలని కోరారు. వర్షాకాలంలో తూంపల్లి పాకాల గ్రామాల మధ్య రాకపోకలు ఇబ్బందిగా ఉన్నాయని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి తెలిపారు.
