
జనం న్యూస్ 21 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
నిర్మాణంలో ఉన్న కొత్త బిల్డింగును త్వరగా పూర్తి చేసి పాఠకులకు అందుబాటులోకి తీసుకురావాలి బి ఆర్ యస్ వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య,,ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయంలో నిరుద్యోగులు, పాఠకుల ఆహ్వానం మేరకు గ్రంధాలయాల వారోత్సవాలకు హాజరైన బీఆర్ఎస్వి రాష్ట్ర కురువ పల్లయ్య..ఈ సందర్బంగా బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య మాట్లాడుతూ…గ్రంథాలయాలు సమాజ అభ్యాసన , సృజనాత్మకతకు కేంద్రాలు.
పుస్తకాలు మనిషి శక్తిని, స్వేచ్ఛను పెంచే ఆయుధాలు.ఇంకా ఈ దేశంలో గ్రంథాలయాల పునరుద్ధరణ జరగాలి.ప్రజా గ్రంధాలయాల పునరుద్ధరణ కేవలం విద్యాపరమైన అవసరం మాత్రమే కాదు, సమాన అవకాశాలపై ఆధారపడిన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి అత్యవసరం అని అన్నారు.తక్షణమే గద్వాల జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్నటువంటి భవనాన్ని పూర్తిచేసి పాఠకులకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు.ప్రస్తుతం గద్వాల జిల్లా గ్రంధాలయంలో మౌలిక సదుపాయాల కొరత తీరలేదు తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి బాత్రూం టాయిలెట్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ని కోరినారు.జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఉన్నటువంటి గ్రంథాలయాలను కూడా నూతన టెక్నాలజీతో అభివృద్ధి చేయాలనీ అన్నారు.ఈ కార్యక్రమం లో పాఠకులు మహాదేవ్, మార్క్, మహేష్, రంగస్వామి, నటరాజు తదితరులు పాల్గొన్నార